ప్రజా సమస్యలను పరిష్కరించాలి: బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్, బాపూజీ నగర్ కాలనీలలో నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ కాలనీ వాసులతో కలిసి శుక్రవారం పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో వర్షపు నీరు, మురికి నీరు రోడ్లపై నిల్వ ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారని రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అధికారిక పార్టీ ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసుకోవడానికే పరిమితమయ్యారని, ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని వాపోయారు. 2018 లో కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ నోచుకోలేదని అన్నారు‌. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట బిజెపి నాయకులు కంచర్ల ఎల్లేష్, తదితరులు ఉన్నారు.

 

గోపీ నగర్ లో పర్యటించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here