ప్రజా సమస్యలపై ఇందిరానగర్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడుతూ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురికి కాలువల పనులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఇందిరానగర్ కాలనీ ప్రెసిడెంట్ సుకుమార్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి, మురగ, ప్రశాంత్, ఇందిరానగర్ కాలనీ వాసులు నర్సింహా యాదవ్, యాదయ్య, రాములు, రవి, షర్మిల, శంకర్, సాయి బాబా, రవి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరా నగర్ లో బస్తీబాటలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here