ప్రతీ బస్తీలో కమిటీలను వేస్తాం: కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తమ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీలో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ నాయకులు సాంబశివ రావు కలిసి బస్తీ కమిటీలను ఎంపిక చేశారు. బస్తీ అధ్యక్షునిగా కృష్ణ యాదవ్, యూత్ కమిటీ అధ్యక్షునిగా ప్రశాంత, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా రాణెమ్మ ను ఎన్నుకున్నట్లు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్తార్, ఆంకా రావు, కృష్ణ యాదవ్, నర్సింగ్ రావు, రాజిరెడ్డి, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

బస్తీ కమిటీలను ప్రకటిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here