- భారత వైమానిక దళాధిపతిగా విఆర్ చౌదరి నియామకం – భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన
- టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి చదువుకున్న వీఆర్ చౌదరి
- తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం – నగరంలోనే నివాసం ఉంటున్న వారి తల్లితండ్రులు
నమస్తే శేరిలింగంపల్లి: బిహెచ్ఈఎల్(రామచంద్రపురం) హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థి వివేక్ ఆర్ చౌదరి ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమితులవ్వడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన విఆర్ చౌదరి కుటుంబం దశాబ్దాల క్రితమే హైదరాబాద్ నగరంలో స్థిరపడింది. ప్రస్థుతం సనత్‌నగర్ జెక్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్‌జీ చౌదరి ఒకప్పుడు బిహెచ్ఈఎల్ ట్రైనింగ్ స్కూల్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహించారు. వారి సతీమణి సుహాస్ చౌదరి భెల్ హైయర్ సెకండరీ స్కూల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించారు. వారి కుమారుడే వివేక్ ఆర్ చౌదరి. ఆయన ప్రస్థుతం ఇండియన్ ఏయిర్ ఫోర్స్‌లో ఏయిర్ స్టాఫ్ వైస్ ఛీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐతే ప్రస్థుతం ఇండియన్ ఏయిర్ ఫోర్స్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌కేఎస్ బదౌరియా సెప్టెంబర్ 30న పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో వివేక్ ఆర్ చౌదరిని తదుపరి ఏయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీఆర్ చౌదరిలు ఇద్దరు భెల్ హైయర్ సెకండరీ స్కూల్‌లో కలసి చదువకున్నారు. స్కూల్‌లోని స్టూడెంట్ కౌన్సిల్‌లోను వారు ఇరువురు సభ్యులుగా పనిచేశారు. 1982 డిసెంబర్ 28న వీఆర్ చౌదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఐఏఎఫ్‌లో చేరినప్పటికి ఆతర్వాత బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగిడిన విషయం విదితమే. ఐతే వీఆర్ చౌదరి నేటికి ఐఏఎఫ్‌లోనే కొనసాగుతు వివిధ స్థాయిల్లో అనేక సేవలందించారు. వీఆర్ చౌదదరికి మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ 29 మరియు సు -30, ఎమ్‌కెఐ ఫైటర్ జెట్‌లతో సహా వివిద విమానాల్లో 3,800 గంటలకు పైగా ఆకాశంలో ప్రయాణించిన అనుభవం ఉంది. అతను ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ యొక్క కమాండింగ్ ఆఫీసర్‌గా ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత వైమానిక దలంలోని వ భారత ప్రభుత్వం పరమ్ విశిష్ట సేవా పతకం(PVSM), అతి విశిష్ట సేవా పతకం(AVSM), వాయు పతకం(VM)లతో వీఆర్ చౌదరిని సత్కరించింది.
ఇండియన్ ఏయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ కావడానికి ముందు వీఆర్ చౌదరి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (WAC) యొక్క కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. సున్నితమైన లడఖ్ సెక్టార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇండియన్ ఏయిర్ స్పేస్ భద్రతను పర్యవేక్షించారు. గత సంవత్సరం చైనాతో సరిహద్దు వైరుధ్యం నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈక్రమంలో IAF దాదాపు అన్ని ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్‌లైన సుఖోయ్ 30 MKI, జాగ్వార్ మరియు మిరాజ్ 2000 విమానాలు తూర్పు లడఖ్‌లోని కీలక వైమానిక స్థావరాలతో పాటు వాస్తవ నియంత్రణ రేఖలో మోహరించింది. వాటితో సహా రాఫెల్ జెట్‌లను వివిధ ఫార్వర్డ్ ఏరియాలకు తరలించడంలో వీఆర్ చౌదరి నేతృత్వం వహించారు. ఈ క్రమంలోనే భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆయనను తదుపరి ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది. తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం కలిగిన వీర్ చౌదరి భారత వైమానిక దలంలో అత్యున్నత పదవిని అధిరోహించడం రాష్ట్రానికే గర్వకారణం. వీఆర్ చౌదరి ఐఏఎఫ్ చీఫ్‌గా నియమితులవ్వడం పట్ల భెల్ హైయర్ సెకండరీ స్కూల్ అలుమ్నీ ఉపాధ్యక్షుడు గొర్తి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
HEARTLY CONGRATULATIONS SIR