నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎంపీ నివాసంలో మర్యాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమస్యలపై ఎప్పటికప్పుడు పార్లమెంట్ లో గళమెత్తడంతో పాటు గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఎంపీ రంజిత్ రెడ్డి చేస్తున్న కృషి గర్వంగా ఉందన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సాయిబాబా ఆకాంక్షించారు.