నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. రామన్ కుమారి తన శిష్య బృందం చేసిన పరం ఉత్సవ్ ఒడిసి నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒడిసి నృత్య ప్రదర్శనలో భాగంగా మంగళాచారం, గురు బ్రహ్మ, శ్లోకాభినయా, స్థాయీ, శబరి పల్లవి, శివ తాండవ, మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాట్యహాసిని ఎడిటర్ లక్ష్మి రామ కృష్ణ , ప్రముఖ నాట్యాచారులు డాక్టర్ విజయ్ పత్లోత్ కళాకారులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.