నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శివరామ చంద్రమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
