నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ గంగారంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ బిర్యానీ, కర్రీ పాయింట్ ను బిజెపి దుబ్బాక శాసన సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభించారు. నిర్వాహకుడు మునింద్రకు రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధు రఘునాథ్ రెడ్డి ఉన్నారు.