నల్లగండ్ల-తెల్లాపూర్ డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించండి: ప్రభుత్వ విప్ గాంధీకి తెల్లాపూర్ మున్సిపల్ పాలక వర్గం వినతి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల – తెల్లాపూర్ మధ్యలో తలెత్తిన డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించాలని తెల్లాపూర్ చైర్మన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డి, కౌన్సిలర్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి విన్నవించారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఆరెకపూడి‌ గాంధీని ఆయన స్వగృహంలో కలిసి డ్రైనేజీ సమస్యను వివరించారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నల్లగండ్ల- తెల్లాపూర్ మధ్య ఎన్నో ఏళ్లుగా తలెత్తిన డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య పరిష్కారానికి తెల్లాపూర్ చైర్మన్, కౌన్సిలర్లు ఎంతో ఔదార్యంతో ముందుకు రావడం చాలా అభినందనీయం అన్నారు. ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని గాంధీ చెప్పారు. సరైన అవుట్ లెట్ లేక మురుగు నీరు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అని, తెల్లాపూర్ కమాన్ వద్ద మురుగు నీరు పేరుకపోవడంతో త్వరలోనే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతామని అన్నారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశించారు. డ్రైనేజీ సమస్య అవుట్ లెట్ పై అధికారులకు ఫోన్ ద్వారా పలు సూచనలు, సలహాలు ఇచ్చి నాణ్యతా ప్రమాణాలతో పనులు  చేపట్టాలని సూచించారు. చైర్మన్ లలిత సోమిరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాబ్జి, లచ్చిరామ్, శ్రీశైలం , నాగరాజు, శ్రీకాంత్ , సొసైటీ సభ్యులు నారాయణ రెడ్డి , దాసు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన తెల్లాపూర్ మున్సిపల్ పాలకవర్గం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here