నమస్తే శేరిలింగంపల్లి : బీసీ బంధు ప్రకటించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వివిధ జిల్లాలకు చెందిన సంఘం సభ్యులతో తరలి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధికి బీసీ బందు పథకం ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య చేపట్టిన దీక్షకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవడానికి అన్ని కులాల వారు కలిసి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బీసీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య కు మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని పేర్కొన్నారు. ధర్మ పోరాట దీక్షకు తరలి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దతు తెలిసిన వారిలో సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ తదితరులున్నారు. అంతకుముందు శేరిలింగంపల్లి తహశీల్దారు కార్యాలయంలో బీసీ బందు పథకం ప్రవేశపెట్టాలని భేరి రాంచందర్ యాదవ్ తో పాటు నర్సింలు ముదిరాజ్, బీసీ సంఘం నేతలు వినతి పత్రం అందజేశాయాదవ్