నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఎంటమాలజి విభాగం సిబ్బందితో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పర్యటించారు. దోమల నియంత్రణకు కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. పిచ్చి మొక్కలు పెరగకుండా కాలనీ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమతమ ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు ప్రభుత్వం ఇప్పటికే చెరువుల్లో డ్రోన్ ల ద్వారా రసాయనిక పిచికారి చేయడం జరుగుతుందని అన్నారు. ఎంటమాలజి సిబ్బందితో కాలనీల్లో ఫాగింగ్ చేయిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజి విభాగం చందానగర్ మెనేజర్ శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.