నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేయడం పట్ల లబ్దిదారుల సంతోషాలకు అవధులు లేవని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన పేదలకు మంగళవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మజురైన సుమారు 600 కార్డులను హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయంలో, శాంతి నగర్ మహిళ భవన్ లో లబ్ధిదారులకు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బల్లింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సుదర్శన్, రవికుమార్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, సయ్యాద్ సాదిక్, హుస్సేన్, సుధాకర్, సయ్యాద్ సాబేర్ హుస్సేన్, శాంతయ్, ప్రవీణ్, గోపాల్, శ్రీనివాస్ నాయుడు, మల్లేష్, లక్షణ, రంజాన్, సుధాకర్, లాలూ పటేల్, సుదేశ్, పద్మ రావు, రవి, అధికారులు వి.అర్.ఓ గోపాల్,లక్ష్మి,రేషన్ డీలర్లు కిషోర్, అభిమన్యు, జైపాల్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.