నమస్తే శేరిలింగంపల్లి:- శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్, లింగంపల్లి, ఆర్ జీ కే, పాపిరెడ్డి కాలనీలలోని అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నాయకులు కటిక రామచందర్, వీఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, కిష్టయ్య, తారనగర్ వార్డు మెంబర్లు కవితాగోపి, శ్రీకళ, పాపిరెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి, లింగంపల్లి గ్రామ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, డీలర్లు సంజీవరెడ్డి, మల్లికార్జున్ యాదవ్, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్, అబ్దుల్ నదీమ్, పార్టీ కార్యకర్తలు నటరాజ్, గోవిందా చారి, మల్లికార్జున్ శర్మ, కిరణ్, అజీమ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, జమ్మయ్య, రామచందర్, పవన్ చంద్రకళ, సౌజన్య, రోజా, సుధారాణి, కళ్యాణి, దీప, గౌరి తదితరులు పాల్గొన్నారు.