శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. సీసీ రోడ్లను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
పాపిరెడ్డి నగర్ లో ఇన్నాళ్లు సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశాలమైన రోడ్లను వేయడం జరుగుతుందన్నారు. యూజీడీ సమస్య కూడా కొంత వరకు తీరిందని మిగతా ప్రాంతాల్లో యూజీడీ పైపులైన్ పనులు చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. ఆయన వెంట వార్డు మెంబర్ పొడుగు రాంబాబు, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, రమణ తదితరులు ఉన్నారు.