నమస్తే శేరిలింగంపల్లి: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణా ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం గ్రేటర్ కమిటీ అధ్యక్షులు చిట్టా రెడ్డిప్రసాద్ అధ్యక్షతన ఉదయం 8గంటలకు బండి సంజయ్ పేరిట తారనగర్ శ్రీ తుల్జాభవని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తారానగర్ విద్యానికేతన్ స్కూల్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఆదేవిధంగా సంఘం సభ్యులు, అభిమానులతో కలసి కేక్ కట్ చేసి బండి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించినందుకు టీపీయూఎస్ఎస్ నాయకత్వాన్ని దీపక్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటు విధులను నిర్వర్తిస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులను, ఆశ వర్కర్లను బిజెపి రాష్ట్ర నాయకుడు, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ చేతుల మీదుగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా పుణ్య కార్యమని, మీరు ఇచ్చే ప్రతి బొట్టు ఇంకోకొరి కుటుంబంలో వెలుగు నింపుతుందని దాతలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీపీయూఏస్ఏస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ రెడ్డి, కమిటీ సభ్యులు కుమార్ యాదవ్, సతీశ్, బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డీ, శేరిలింగంపల్లి నాయకులు మారం వెంకట్, నాగులు గౌడ్, కర్చేర్ల ఏళ్లేష్, రాధాకృష్ణ, రామ్ రెడ్డీ, టీపీయూఏస్ఏస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చారి, కమిటీ సభ్యులు గోవర్థన్ రెడ్డి, రవి ప్రకాష్, భరత్ రాజ్, శ్రీధర్ రెడ్డి, శ్రీను, బొంతు కోటయ్య, బీజేపీ కార్యకర్తలు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.