కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులేసినా హుజూరాబాద్‌లో దుబ్బాక ఫలితాలే రిపీట్: మాజీ ఎంపి జితేందర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజలను తన మాయమాటలతో నమ్మించి పబ్బం‌ గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసకారి అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మండిప‌డ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దుబ్బాక‌ ఉప ఎన్నిక సీన్‌ రిఫీట్‌ అవడం తథ్యమని అన్నారు. శేరిలింగంపల్లిలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అధ్యక్షతన అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాసులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, జాతీయ ఖాదీ బోర్డ్ మెంబర్ పేరాల శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‌జితేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలపై, వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని కెసిఆర్ కుటుంబం అంతా దోచుకొని అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కేవలం కమిషన్ పథకాలుగా మారాయని ఎద్దేవా చేశారు.

బిజెపి‌ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కెసిఆర్ గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. ఇప్పుడు కెసిఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకుందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నారని జితేందర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక కోసం విచ్చలవిడిగా మందు, డబ్బులు పంపిణీ చేసి హుజూరాబాద్ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజలు, యువత కెసిఆర్ కి దుబ్బాక లో బుద్ది చెప్పినట్టు గానే ఇక్కడ కూడా చెప్తారని అన్నారు. ప్రతి బిజెపి కార్యకర్త హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైనికుల్లా పనిచేసి బిజెపి గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, కళ్లెం రవీందర్ రెడ్డి, శ్రీ రాములు యాదవ్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వై శ్రీధర్, చింతకింది గోవర్ధన్ గౌడ్, మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి శ్యామల, రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి శ్రీమతి కాంచన కృష్ణ, రంగారెడ్డి అర్బన్ జిల్లా లోని డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పథాదికారులు,రాష్ట్ర పథాదికారులు పాల్గొన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న బిజెపి రంగారెడ్డి అర్భ‌న్ జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here