నమస్తే శేరిలింగంపల్లి: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ ఆర్ బి ఆర్ కాంప్లెక్స్ 304 ఫ్లాట్ లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్ పెక్టర్ వెంకటేష్ సామల నేతృత్వంలో దాడిచేసి పేకాట ఆడుతున్న ఎం.శివ(34), నాగరాజు(34), సంజు @బాలు, గురువులు(28) లను అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుండి రూ.15900 స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.