దేశ‌ప‌తికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయ‌కుడు మ‌హేష్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ జ‌న్మ‌దిన వేడుక‌లు గురువారం ఘ‌నంగా జ‌రిగాయి. బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ వారి నివాసంలో దేశ‌పతిని ఘ‌నంగా స‌త్క‌రించి, కేక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. దేశ‌ప‌తి శ్రీనివాస్ భవిష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని, ఆయువు ఆరొగ్య ఐశ్య‌ర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు మ‌హేష్ యాద‌వ్ తెలిపారు. దేశ‌ప‌తికి శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, నాయ‌కులు జనార్దన్ రావు, ఫణి, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

దేశ‌ప‌తిని స‌న్మానిస్తున్న బోయిని మ‌హేష్ యాద‌వ్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here