ఆశోక్‌న‌గ‌ర్‌లో వీఆర్ ఫిట్‌నెస్ స్టూడియో… ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నేత‌ క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెవైఎం రాష్ట్ర నాయ‌కులు నంద‌నం విష్ణుద‌త్ ప‌టేల్ ఆద్వ‌ర్యంలో అశోక్‌న‌గ‌ర్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన వీఆర్ ఫిట్‌నెస్ స్టూడియోను బిజెపి రాష్ట్ర నాయ‌కులు, జ‌నంకోసం స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌సిరెడ్డి మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవ‌నంలో ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, ఈ క్ర‌మంలోనే ఫిట్‌నెస్ సెంట‌ర్లు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతాయ‌ని అన్నారు. నిర్వాహ‌కుడు విష్ణుద‌త్ మాట్లాడుతూ త‌మ వీఆర్ ఫిట్‌నెస్ సెంట‌ర్‌లో యోగాతో పాటు జుంబా డ్యాన్స్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిని సేవ‌లు ప్రారంభిస్తామ‌ని అన్నారు.

వీఆర్ ఫిట్‌నెస్ సెంట‌ర్‌ను ప్రారంభిస్తున్న క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, నిర్వాహ‌కుడు నంద‌నం విష్ణుద‌త్ ప‌టేల్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here