మూడు కాల‌నీల్లో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లను ప‌ర్య‌వేక్షించిన‌ చందాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం, వెమనకాలని, వెమన వికర్ సేక్షేన్ కాలనిలలో ఆదివారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప‌ర్య‌టించారు. డీఆర్ఎఫ్ సిబ్బందిచే ద‌గ్గ‌రుండి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో లక్షణాలను గుర్తించిన వెంటనే కరోనా నియంత్రణ మందులను అందజేస్తూ, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు అవసరం అయితే తప్పా బయటకి రావొద్దని, బయటకి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా మస్కు, భౌతిక దూరాలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు సుందర్, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, దాసు, రఘునాథ్ రెడ్డి, గౌరవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్ఎఫ్ సిబ్బందిచే క‌రోనా క్రిమి సంహార‌క మందుల‌ను పిచికారి చేయిస్తున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here