నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్ మజీద్ వద్ద శుక్రవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక ముస్లింలకు రంజాన్ కానుక కిట్‌లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లోను ముస్లిం సోదరులు సగౌరవంగా ఈద్ జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ తోఫా పంపిణీకి ఆదేశించారని అన్నారు. ముస్లిం సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తు రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ జహంగీర్, నాయకులు రహీం, ముజీబ్, అబ్దుల్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.






