నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా డీఆర్ఎఫ్ ఆద్వర్యంలో చేపట్టిన శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఆమె పర్యవేక్షించారు. బస్తీలోని వాడవాడలా దగ్గరుండి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభన కొనసాగుతున్న వేళ ప్రజలు భయాందోళలను వీడి అప్రమత్తంగా ఉండాలని, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా మహమ్మారి నుంచి బయటపడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, దాసు, షౌకత్, గౌరవ్, రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






