గ‌చ్చిబౌలి టిమ్స్ ద‌వ‌ఖాన వ‌ద్ద పోలీస్ హెల్ప్ డెస్క్… రోగుల తాజా ఆరోగ్య‌ ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మాచారం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టీట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైనెన్స్ ఆండ్ రీసెర్చ్‌(టిమ్స్) ద‌వ‌ఖాన వ‌ద్ద సైబ‌రాబాద్ పోలీస్‌ల ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ హెల్ప్ డెస్క్‌ను గురువారం మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, టిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ విమ‌ల థామ‌స్‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సెకెండ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో టిమ్స్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చే రోగుల సంఖ్య రోజురోజుకు ఘ‌న‌నీయంగా పెరిగిపోతున్న‌ద‌ని అన్నారు. ద‌వ‌ఖానలో రోగుల‌కు నాణ్య‌మైన వైద్యం అందిస్తున్నార‌ని, ఐతే వైర‌స్ వ్యాప్తి దృష్టా రోగుల స‌హాయ‌కుల‌ను ద‌వ‌ఖానాలోకి అనుమ‌తించ‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే మేయిన్ గెట్ వ‌ద్ద గ‌చ్చిబౌలి పోలీసుల ఆద్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా పోలీస్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. వైద్య, బ‌ల్దియ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో హెల్ప్‌డెస్క్ సెవ‌లు కొన‌సాగుతాయ‌ని అన్నారు. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న‌ రోగుల‌కు సంబంధించిన కుటుంబ స‌భ్యులు, బంధువులు ఈ హెల్ప్‌డెస్క్‌కు విచ్చేసి వారి తాజా ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకోవ‌చ్చ‌ని అన్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స‌కాలంలో స‌మాచారం తెలుసుకోలేక హైరాన చెందుతున్న‌ రోగుల సంబంధీకుల‌కు ఈ హెల్ప్‌డెస్క్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిమ్స్‌ ఆర్ఎంఓ డాక్ట‌ర్ శ‌శిధ‌ర్‌, మాదాపూర్ ఏసీపీ ర‌ఘునంద‌న్‌, గచ్చిబౌలి ఇన్‌స్పెక్ట‌ర్ సురేష్‌, ఎస్ఐ న‌వీన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించిన మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, టిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ విమ‌ల థామ‌స్‌ల‌తో టిమ్స్ ఆర్ఎంఓ డాక్ట‌ర్ శ‌శిధ‌ర్‌, మాదాపూర్ ఏసీపీ ర‌ఘునంద‌న్‌, గచ్చిబౌలి ఇన్‌స్పెక్ట‌ర్ సురేష్‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here