నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రూపదేవి, ఏఈ రమేష్‌లతో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గురువారం పర్యటించారు. ప్రధానంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను కాలనీ వాసులు వారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, ఎస్ఆర్పీ నాగరాజు, కాలనీ వాసులు ఉమాకిషన్, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.






