నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలో ముదిరాజ్ భవనం నిర్మాణం షురు అయ్యింది. ఈ సంద్భంగా బుదవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సోదరులు తమ అవసరాల కోసం భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. వారికి తమవంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపన్‌పల్లి ముదిరాజ్ సంఘం పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






