నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ చతుర్థ బ్రహ్మోత్సవాలు మూడవరోజు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు వేదుల పవన్‌కుమార్ శర్మ బృందం పర్యవేక్షణలో మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామికి విశేష పంచామృతాభిషేకాలు, అలంకరణ, నాగవల్లి దళార్చన, ఆకుపూజ, శ్రీ సుబ్రహ్మణ్య సహిత సర్ప సూక్తం నాగ దేవత హోమం, మన్యసూక్త హనుమత్ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ సాయిబాబా దేవాలయం తరపున ప్రధానార్చకులు మురళీధర శర్మ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ.రమణమూర్తి, పాలకమండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంత భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు వేదుల పవన్ కుమార్ శర్మతో అన్నపూర్ణ ఎంక్లేవ్ సాయిబాబా దేవాలయం ప్రధానార్చకులు మురళీధర శర్మ





