నమస్తే శేరిలింగంపల్లి: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు మియాపూర్ డివిజన్ లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీ లో సోమవారం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. బాధితులకు వైద్యసహాయం అందజేయడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉంటున్న వారికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శ్యానిటేషన్ సిబ్బంది కాలనీవాసులు రాణి, లత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






