- చందానగర్ లో 37 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలంలో అయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. గతేడాది కరోనా ప్రారంభంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వేలమంది నిరాశ్రయుల ఆకలి తీర్చిన అయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ తాజాగా కోవిడ్ సెకండ్ వైపు దృష్టి కొనసాగుతున్న క్రమంలో తన సేవలను తిరిగి మొదలు పెట్టింది. నైట్ కార్ఫ్యూ నేపథ్యంలో ఉపాధికి బంగం కలిగిన చందానగర్ స్వాగత్ హోటల్ వెనకాల ఉన్న గుడిసె వాసులకు ఏ ఎస్ వై ఎఫ్ చేయూత అందించింది. మొత్తం 37 కుటుంబాలకు చెందిన 110 మంది సభ్యుల ఆకలి తీర్చేందుకు 125 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆపత్కాలంలో నిరుపేదలకు తమ వంతుగా సహకారం అందించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. అవసరాలకు అనుగుణంగా తమ సేవలు కొనసాగిస్తామని అన్నారు. కాగా ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ సేవల పట్ల స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, భాను ముదిరాజ్, మల్లిక్, సురేష్ జీవం శ్రవణ్ అఖిల్ ఇతరులు పాల్గొన్నారు.