నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్‌నగర్‌లో శనివారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీలోని ముస్లింలకు ప్రభుత్వం తరపున రంజాన్ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రెండవ దశ విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లింలు తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు అన్వర్ షరీఫ్, కాజా పాషా, మొహిన్, ముజీబ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






