కార్మికులు లేనిదే మాన‌వ మ‌నుగ‌డ లేదు…. మేడే వేడుక‌ల‌లో చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌వైద్యాధికారి డాక్ట‌ర్ కార్తిక్‌

నమ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణా మునిసిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ – కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు చందానగర్ సర్కిల్ కార్యాల‌యం వ‌ద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చందానగర్ సర్కిల్ ఉప‌వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ కార్మిక జెండాను ఎగుర‌వేసి కార్మికులంద‌రికి మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కార్మికులు లేనిదే మాన‌వ మ‌నుగ‌డ లేద‌ని, క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్రాణాల‌కు తెగించి జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవ సూర్య‌చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచిపోతుంద‌ని అన్నారు. అలాంటి కార్మికుల‌కు ప్ర‌జ‌లు అండ‌గా నిల‌వాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణా మునిసిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ- కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్,య ఎన్విరాన్మెంట్ ఇన్చార్జ్‌ రామకృష్ణ కార్మిక నాయ‌కులు నాగేశప్ప, వెంకటేష్, బిక్షపతి, అచ్యుత్, కనకరాజు, బాలజి, కిష్టప్ప, నాగరాజు గౌడ్, నాగరాజు, గురుచరణ్, అజరుద్దీన్, అంజనేయులు, వెంకటేష్, నాగరాజు నాయక్, చిన్న, రామప్ప, రాములుల‌తో పాటు, రవాణ, ఎలక్ట్రికల్, ఎంటమాలజి, పీజేఆర్‌స్టేడియం సిబ్బంది, కంప్యూటర్ అప్రెటర్స్‌, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యం వ‌ద్ద జెండావిష్క‌రిస్తున్న ఏఎంఓహెచ్ డాక్ట‌ర్ కార్తిక్‌, తిప్ప‌ర్తి మ‌హేష్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here