భ‌వానీపురంలో డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీలో స్థానిక కార్పొరేట‌ర్ రెడ్డి మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, జీహెచ్ంఎసీ అధికారుల‌తో క‌ల‌సి ప్ర‌భుత్వవిప్ ఆరెక‌పూడి గాంధీ సోమ‌వారం ప‌ర్య‌టించారు. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్య తీవ్ర‌త‌ను కాలనీ వాసులు ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్ల దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీ నుండి వచ్చే మురుగు నీరును నాలలోకి లింక్ కల్పకుండా భవాని పురం కాలనీ విధుల్లోకి వదలడం ఏ మాత్రం భావ్యం కాదని, నాలాలోకి కలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు కాలనీ పరిసర ప్రాంతాల్లో చేరడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని, రోడ్లన్నీ మురుగు మయం అవుతున్నాయ‌ని, కాలనీ వాసుల విజ్ఞప్తి మెరకు స‌మ‌స్య‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. యుద్ధప్రాతిపదికన మురుగ‌నీరును నాలలోకి కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడలని అధికారులక సూచించారు. ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈ శంకర్, డీఈ రూపదేవి, ఏఈ అనురాగ్, ఇరిగేషన్ ఏఈఈ శేషగిరి రావు, ఎస్‌టీపీ జీఎం వాస సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, డివిజన్ టీఆర్ఎస్ అధ్య‌క్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, దాస్, కొండల్ రెడ్డి, జగదీష్, గుడ్ల ధనలక్ష్మి కాలనీ వాసులు రఘునంధన్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, అధికారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here