- మదీనగూడ బ్రాంచ్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రి ఫైనల్స్ అంటూ షెడ్యూల్ జారీ
- యాజమాన్యం తీరుపై మండిపడుతున్న విద్యార్థుల తల్లితండ్రులు
నమస్తే శేరిలింగంపల్లి: కరోన మల్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. ఐతే కొన్ని చోట్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం సర్కారు నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులకు తరగతులు, పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఇటీవల మియాపూర్ మాతృశ్రీనగర్ లోని శ్రీ ఆద్య జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాల విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుపడటంతో తమ నిర్ణయాన్ని మార్చుకుని ఆన్‌లైన్‌లోనే పరిక్షలు నిర్వహించారు. సదరు ఘటన జరిగి వారం రోజులు గడువక ముందే మరో కళాశాల యాజమాన్యం ఆఫ్‌లైన్‌లో ప్రి ఫైనల్స్ పరీక్షలకు హాజరవ్వాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చింది.
వాట్సాప్‌లో పరీక్షల షెడ్యూల్ విడుదల…
శ్రీ చైతన్య కళశాల మదీనగుడ బ్రాంచ్(మ్యాక్స్ పక్కన) ప్రి ఫైనల్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. బ్యాచ్‌ల వారిగా ఆన్‌లైన్‌లో అదేవిధంగా ఆఫ్‌లైన్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కళాశాల వాట్సాప్ గ్రూప్‌లలో ఒక ప్రకటన జారీ చేశారు. యాజమాన్యం నిర్ణయంపై విద్యార్థుల తల్లితండ్రులు మండిపడుతున్నారు. ఒకవైపు కరోన కేసులు పెరిగిపోతుంటే, మరోవైపు పరీక్షల కోసం విద్యార్థులను కళాశాలలకు పిలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసి, విద్యాసంస్థలను మూసివేయాలంటు ఆదేశాలు జారీ చేసినా ప్రైవేట్ కళాశాల యాజమన్యాలు ఈ విధంగా ప్రవర్తించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తమ నిర్ణయాన్ని మార్చుకుని ప్రీ ఫైనల్స్ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి…
ఆఫ్‌లైన్ పరీక్షల నిర్వహణపై శ్రీ చైతన్య కళాశాల వైస్ ప్రిన్సిపల్‌ను నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా పై అధికారుల ఆదేశాల మేరకు ప్రకటనను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్టు తెలిపారు. సోమవారం నుంచి పరీక్షల నిర్వహంచే విషయంమై చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాల కోసం ప్రన్సిపల్‌ను సంప్రదించాలని కోరారు.
Promote without exams for first year and second year students we need justice next we have to vete please remember it
[…] […]