నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ గ్రామంలో స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు వినతిపత్రాన్ని అందచేశారు. హఫీజ్ పెట్ స్మశానవాటికలో కనీస మౌలిక వసతులు లేక చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నట్టు జెడ్సికి వివరించారు. స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ, స్నానపు గదులు, వెయిటింగ్ హాల్ ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నాయకులు కనకమామిడి నరేందర్ గౌడ్,మన్నే వెంకటేష్ ముదిరాజ్, బోయిని జితేందర్ యాదవ్, నిమ్మల జగన్ గౌడ్, ఎం.రాధ కృష్ణ, టి.విక్రమ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.