నమస్తే శేరిలింగంపల్లి: రాజకీయాల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత పదవులను అలంకరించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు ఎం.భిక్షపతియాదవ్ అన్నారు. నియోజకవర్గానికి చెందిన కాంచక కృష్ణ బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చ స్పోక్స్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా శుక్రవారం భిక్షపతియాదవ్, బిజెపి నాయకుల రవికుమార్యాదవ్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భిక్షపతియాదవ్ కాంచన కృష్ణకు అభినందనలు తెలిపారు. కాంచన కృష్ణ మాట్లాడుతూ ఎస్సీల అభివృద్దికి కృషి చేయడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి, నాయకులు సతీష్కురుమ తదితరులు పాల్గొన్నారు.






