ప్రతీ ఒక్క‌రి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుప‌డ‌తాం: తౌట్‌రెడ్డి సంతోష్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌జ‌ల‌కు ఉండే ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు వారికి గ‌ల హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల సంఘం ఆధ్వ‌ర్యంలో కృషి చేస్తున్నామ‌ని సంఘం తెలంగాణ చైర్మెన్ తౌట్‌రెడ్డి సంతోష్‌రెడ్డి అన్నారు. సంఘం జాతీయ చైర్మెన్ సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో నెల్లూరు జిల్లాలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాటక రాష్ట్రాల సంఘం స‌భ్యుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించారు.

స‌ద‌స్సులో మాట్లాడుతున్న తౌట్‌రెడ్డి సంతోష్ రెడ్డి

ఈ సద‌స్సులో పాల్గొన్న సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డైనా మనిషి హక్కులపై అన్యాయం జరిగినా నిలదీయడానికి సిద్ధంగా ఉంటామ‌ని, ప్రతి మారుమూల గ్రామం వరకు మాన‌వ హక్కుల పై అవగాహన సదస్సులను నిర్వ‌హించి బాల్య వివాహాలు, స్త్రీలపై జరుగుతున్న వరకట్న వేధింపుల నిర్మూల‌న‌కు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రపంచ మానవ హక్కుల సభ్యులందరికీ స్టార్ హెల్త్ ప్లస్ ఇన్సూరెన్ నుండి 25 లక్షల ప్రమాద బీమా బాండ్లను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ జగ్గారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ఎల్‌. నరసింహారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డి. సురేష్ యాదవ్, రాష్ట్ర మహిళ వింగ్ చైర్ పర్సన్ గీతా రెడ్డి , సమత , మహీళా వింగ్ డైరెక్టర్ బి.సంధ్యా రెడ్డి , సంఘం స‌భ్య‌లు ఎల్‌. తిరుపతి రెడ్డి, పుట్ట వీరేష్, వర్ధమాన్ మోహన్ చారి, చేతన్ కిరణ్, వి. తిరుపతి రెడ్డి, దండ సంపత్ రెడ్డి, రాజ మల్లారెడ్డి, కొమ్ములు శ్యామ్, బేగరి చెన్నయ్య, జగన్, సరస్వతి, గణిత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here