మియాపూర్ ముజ‌ఫ‌ర్ అహ్మ‌ద్‌న‌గ‌ర్ దేవాల‌య ప్రాంగ‌ణంలో నిర్మాణాల కూల్చివేత‌

అడ్డుకున్న బిజెపి నాయ‌కులు… స‌ర్దిచెప్పిన హెచ్ఎండిఎ అధికారులు

హెచ్ఎండిఎ అధికారులు నేల‌మ‌ట్టం చేసిన నిర్మాణం

మియాపూర్ ఎంఏనగర్ లోని దేవాలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలను హెచ్ఎండీఏ అధికారులు గురువారం కూల్చివేశారు. విష‌యం తెలుసుకున్న శేరిలింగంప‌ల్లి బిజెపి నేతలు, బస్తీ నాయకులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్ధి చెప్పడంతో నాయకులు, స్థానికులు శాంతించారు. పాత దేవాలయాల జోలికి వెళ్లమని గుడుల పేరుతో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టత ఇవ్వడంతో నిరసనకారులు వెనుదిరిగారు.

అధికారులు కూల్చివేసిన నిర్మాణం

దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ హెచ్ఎండీఏ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. గత రెండు రోజులుగా చేపడుతున్న నిర్మాణాన్ని స్థానికులు స్వయంగా తొలగించుకోగా గత కొంత కాలం క్రితం చేపట్టిన స్టేజిలాంటి నిర్మాణాన్ని జేసీబీ సాయంతో హెచ్ఎండీఏ సిబ్బంది కూల్చి వేశారు. నిర్మాణ కూల్చివేత‌ల‌ను అడ్డుకున్న వారిలో బిజెపి నేతలు కసి రెడ్డి భాస్కర రెడ్డి, రవి కుమార్ యాదవ్, చింతకింది గోవర్ధన్ గౌడ్, రాఘవేంద్ర రావు, రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, రాగిరి సాయిరామ్ గౌడ్, శివకుమార్ వర్మ, రాజశేఖర్, పి. వేణుగోపాల్, మానిక్. మహేష్, లక్ష్మణ్, రాఘవేంద్ర రావు, కేశవు గుండె గణేష్ ముదిరాజ్, బస్తీ నాయకులు అనిల్, పల్లె మురళి, సుఖన్య, ఆకుల రమేష్, మధు, వెల్డింగ్ రాజు, వెంకట్ తదితరులు ఉన్నారు.

హెచ్ఎండిఎ అధికారుల‌ను అడ్డుకున్న బిజెపి నేత‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here