నమస్తే శేరిలింగంపల్లి: ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హఫీజ్ పేట్ డివిజన్ కు చెందిన వెంకటచైతన్యకు రూ. 1లక్షా 25 వేల రూపాయలు, శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన సాయిచరణ్‌కు రూ. 1లక్ష చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యతనిచ్చి పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజా రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






