ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పేద‌ల సంక్షేమాన్ని విస్మ‌రించేది లేదు: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ పేద ప్ర‌జ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించ‌బోమ‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ పథకం ద్వారా 148 మంది లబ్దిదారులకు మంజూరైన‌ రూ. 1 కోటీ 48 ల‌క్ష‌ల‌ ఆర్థిక సహాయ చెక్కుల‌ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గ‌డ్డం రంజిత్ రెడ్డి, గౌరవ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ , పూజిత జగదీశ్వర్, మంజుల రఘునాథ్ రెడ్డిల‌తో కలిసి లబ్దిదారులకు ప్ర‌భుత్వ విప్ గాంధీ అంద‌జేశారు. ఈ సందర్బంగా గాంధీ, రంజిత్‌రెడ్డిలు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్, నాయబ్ తహసీల్దార్ శంకర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహిపాల్ రెడ్డి, ఆర్ఐ చంద్రారెడ్డి, జూనియర్ అస్సిటెంట్లు సాయికిరణ్, హంజద్ మరియు మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ సాంబశివరావు, బియ‌స్‌య‌న్‌ కిరణ్ యాదవ్ , చెన్నం రాజు, మాధవరం గోపాల్, జనార్దన్ రెడ్డి, గుమ్మడి శ్రీను, రాంచందర్ చాంద్ పాషా, జంగం గౌడ్ , బలరాం యాదవ్, తిరుపతి యాదవ్, అక్బర్ ఖాన్, మల్లేష్, జగదీష్, అక్కరావు, అబ్దుల్ రహమాన్, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here