నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం, పసుమర్తి మాధవరావు, దమయంతి చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లికి చెందిన ఓ పేద విద్యార్థి చదువుకై ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళవారం ట్రస్టు వ్యవస్థాపకులు పసుమర్తి శ్రీనివాస్ గుప్త, వసుందర దంపతులు శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన మణికంఠ స్కూల్ ఫీజు కోసం పదివేల రూపాలయ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ విద్యదానం అన్ని దానాలలోకెల్లా గొప్పదని, పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తే వారి కుటుంబానికి దారి చూపిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు మారం వెంకట్ గుప్త, వర్కింగ్ ప్రెసిడెంట్ నటరాజ్ గుప్త, కోశాధికారి సంపత్ గుప్త, కార్యదర్శి వనమా శ్రీనివాస్ గుప్త ఉపాధ్యక్షులు మహేష్ గుప్త సభ్యులు వాసమురళి తదితరులు పాల్గొన్నారు.






