బిజెపి నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భైంసాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తు పలు హిందూ సంస్థలు డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మియాపూర్ పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ క్రమంలోనే బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ రాజ్ జైశ్వాల్ ను నడిగడ్డ తాండాలోని వారి ఇంటి వద్ద అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా రాజ్ జైశ్వాల్ అరెస్టును బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగే సంఘటనలపై తీవ్రంగా స్పందించే అధికార పార్టీ నేతలకు రాష్ట్రంలో చిన్నారి బాలికపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించకపోగా, న్యాయం కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. అత్యాచారం ఘటనలో నిందితుడు ఎవరైనా వారిని శిక్షించేంతవరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ రాజ్ జైస్వాల్ ను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here