నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ పట్టభద్రుల తరపున ప్రశ్నించే గొంతుకనై వస్తున్నా అని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టడానికి ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బుధవారం వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కస్తూరి బా పాఠశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. కరపత్రాలను పంచుతూ 74 నంబర్ లో మొదటి ప్రధాన్యతగా 1వ నంబర్ వేసి తన గెలుపునకు సహకరించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిరుద్యోగులకు ఉచితంగా పలు కోర్సుల్లో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు అన్ని వర్గాల మద్దతు తనకు ఉందని గెలుపు తథ్యమని రాగం సతీష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు శ్రీకృష్ణ యాదవ సంఘం భవనంలో యాదవ గ్రాడ్యుయేట్లతో, యాదవ సంఘం పెద్దలతో సమావేశం నిర్వహించారు. తప్పకుండా తమ సామాజిక వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ కు మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించుకుంటామని తీర్మాణం చేశారు. ఎన్నికల ప్రచారంలో కొల్లాపూర్ యాదవ జేఏసీ చైర్మన్ పరిగల బాలయ్య యాదవ్, మేకల రాములు యాదవ్, అప్పల మాసయ్య యాదవ్, యాదవ జాగృతి కేంద్ర కార్యదర్శి బత్తుల గంగులు యాదవ్, శివ యాదవ్, శేఖర్ యాదవ్, మహేష్ యాదవ్, దేవెందర్, శివరాజ్, వెంకటేష్, రాములు యాదవ్, తదితరులు ఉన్నారు.
పట్టభద్రులను ఓట్లు అభ్యర్థిస్తున్న రాగం సతీష్ యాదవ్





