కొండాపూర్ లో కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం

కొండాపూర్(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) : ఉమ్మ‌డి హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హమీద్ పటేల్ పలువురు గ్రాడ్యుయేట్ ఓటర్లను క‌లిసి తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ విద్యాధికురాలు, ఎందరినో విద్యావంతులుగా, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన సురభి వాణిదేవి వంటి వ్య‌క్తిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్య‌త ప్ర‌తీ ఓట‌రుపై ఉందన్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్లు టిఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని, ఎన్నిక‌ల్లో సుర‌భి వాణిదేవి భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తార‌ని ధీమావ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కొండాపూర్ తులిప్స్ కాల‌నీలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్న హ‌మీద్ ప‌టేల్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here