మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం మియాపూర్‌లోని అతిథి హోటల్‌లో నిర్వహించనున్నట్లు శేరిలింగంపల్లి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గం.లకు నిర్వహించే ఈ వేడుకలకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, సినీ నటి సిమ్రాన్ చౌదరి, సినీ నిర్మాత శిల్ప చౌదరిలు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి, మోటివేషనల్ స్పీకర్ సత్యవాణి, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఎం.డి డాక్టర్ విజయలక్ష్మి, విద్యావేత్త – లయన్స్ క్లబ్ గవర్నర్ సురభి దుర్గావాణి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ, అడ్వకేట్ వరలక్ష్మిలు హాజరవనున్నారని తెలిపారు. సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించేలా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.






