నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావును మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని బిజెపి శేరిలింగంపల్లి నాయకులు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, లెక్చరర్లు ,విద్యాలయ ప్రొఫెసర్లు తదితర గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి బిజెపికి ఓటు వేసి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన ఆరేళ్లలో రామచంద్రారావు ఎమ్మెల్సీగా రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన వేదికలపై పట్టభద్రుల సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తు కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ దానికి పట్టభద్రుల గొంతుక గా మారాడని అన్నారు. శాసన మండలిలో తన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఎన్జీవోలు ,ఉపాధ్యాయులు ,లెక్చరర్లు ,విద్యాలయ ప్రొఫెసర్లు ,ప్రభుత్వ రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ,నిరుద్యోగ యువత ,విద్యార్థుల సమస్యలపై విస్తృతమైన స్థాయిలో స్పందించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజల సమస్యలను, మనోభావాలను వ్యక్తీకరించడానికి పెద్దల సభలో సమర్థవంతమైన స్వరం కోసం రామచంద్ర రావును మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘునాథ్ యాదవ్, రాధా కృష్ణ యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






