గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవికి వేయాలని మాజీ కార్పొరేటర్ సాయిబాబ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని ఖాజాగూడ వీకర్ సెక్షన్ కాలనీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఓటర్ స్లిప్పులను అందజేశారు. అనంతరం సాయిబాబ మాట్లాడుతూ పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.