హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని, శేరిలింగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ ఏరియా కమిటీ సభ్యుడు సుదేష్ కుమార్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సాబేర్‌లు డివిజన్ పరిధిలోని సాయినగర్, యూత్ కాలనీలలో చేపట్టిన సభ్యత్వ నమోదు పత్రాలను ఆదివారం కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ కు అందజేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్‌లు పూజిత జదీశ్వర్‌గౌడ్, జగదీశ్వర్‌గౌడ్, డివిజన్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతంగౌడ్‌ల ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వాన్ని గత వారం రోజులుగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశామని సుదేశ్, సాబేర్ లు తెలిపారు.






