మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): అతివేగంగా బైక్ రైడ్ చేస్తూ డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మణుగూరు జిల్లా మంగపేట ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(23), సన్నీ రామిరెడ్డి(21) లు నగరంలో నివాసముంటూ బీటెక్ చదువుతున్నారు. కాగా శుక్రవారం వీరిద్దరూ తమ ద్విచక్ర వాహనం (TS04FB4344) పై శుక్రవారం ఉదయం 2:20 గం. ల సమయంలో గచ్చిబౌలి డీఎల్ ఎఫ్ నుండి ఎల్బీ నగర్ వైపు కొత్తగూడ మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా బైక్ నడుపుతూ కొత్తగూడ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇరువురికీ తీవ్ర గాయలపాలై రక్తస్రావం జరుగగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. విజయ్ కుమార్ మార్గ మధ్యలోనే మృతి చెందగా, రామి రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.