చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస ప్రధానకార్యదర్శి దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ తన పుట్టినరోజు వేడుకలను మదీనాగూడలో ఉన్న షిరిడీ సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షుడు అడ్వకేట్ రంగనాథ్, తెరాస నాయకులు రాజు, సునీల్ రాజు, వెంకటరమణ, తిరుపతిరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.







