స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు న్యూ కాలనీ వాసుల విన‌తి

మియాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ వాసులు త‌మ కాల‌నీలో డ్రైనేజీ, సీసీ రోడ్డు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు శ‌నివారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాల‌నీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను సంబంధిత శాఖల అధికారుల‌తోపాటు ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీ దృష్టికి తీసుకెళ్తాన‌ని తెలిపారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి చంద్రికప్రసాద్ గౌడ్, తెరాసనాయకుడు అశోక్, కాలనీవాసులు లావణ్య, రమాదేవి, మాధవి, స్వప్న, ఇందిర, స్వరూప పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న న్యూ కాల‌నీ మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here