భ‌గ‌త్ సింగ్ క్రికెట్ టోర్న‌మెంట్ ను ప్రారంభించిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

గ‌చ్చిబౌలి‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గౌలిదొడ్డి ఎన్‌జీవోఎస్ కాల‌నీలో శుక్ర‌వారం భ‌గ‌త్ సింగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ను కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క్రీడ‌ల వ‌ల్ల శారీరక దారుఢ్యంతోపాటు మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంద‌న్నారు. టోర్న‌మెంట్‌లో అంద‌రూ ఉత్సాహంగా పాల్గొనాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా టోర్న‌మెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల‌ను ఆయ‌న అభినందించారు. అనంత‌రం క్రీడాకారుల‌కు చెందిన జెర్సీల‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ స‌ర్పంచ్ నాగేష్ యాద‌వ్‌, మాజీ వార్డు మెంబర్లు మ‌ల్లేష్ యాద‌వ్‌, న‌ర్సింగ్ రావు, బ‌ల‌రాం, మాట్ల తిరుప‌తి, మహేందర్, భిక్షపతి, శ్యామ్ రావు, గిరి, ప్రసాద్, కిషన్, గుండప్ప, కిషోర్ యాదవ్, పాపాలాల్ పాల్గొన్నారు.

టోర్న‌మెంట్‌ను ప్రారంభించిన అనంత‌రం క్రికెట్ ఆడుతున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
క్రీడాకారుల జెర్సీని ఆవిష్క‌రిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here